రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చలికి వణికిపోతున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల నుంచి మధ్య భారతం మీదుగా అతి తక్కువ ఎత్తులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పొడిగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం కారణంగా చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనికితోడు సూర్యడు జాడ ఉదయం 9 గంటల వరకు కనిపించండం లేదు. ఫలితంగా ప్రజలు చలికి వణికిపోతున్నారు.
ముఖ్యంగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తుంది. ఉదయం 9 గంటలు అవుతున్నా సూర్యుడి జాడ కనిపించపోవడంతో జనం చలికి వణుకుతున్నారు. మధ్య భారతం మీదుగా వీస్తున్న పొడిగాలులు కారణంగా ఏపీలోని కోస్తా ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉంది
అలాగే, ఒరిస్సా రాష్ట్రానికి సమీపంలో ఉన్న ఉత్తరాంధ్ర, తెలంగాణాను ఆనుకుని ఉన్న మధ్య కోస్తా శివారు ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత అధికంగా ఉంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల తక్కువగా నమోదవుతున్నాయి. చింతపల్లిలో అత్యంత కనిష్టంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ యేడాది ఇక్కడన నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం.