ధాన్యం సేకరణపై జగన్‌ సమీక్ష: అలసత్వం ఉండకూడదు

సోమవారం, 20 డిశెంబరు 2021 (15:35 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. పంట కొనుగోళ్ల ఆర్బీకేలు, అధికారులు కృషి చేయాలన్నారు. 
 
రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని.. ఎక్కడా కూడా సమాచార లోపం వుండకూడదని చెప్పుకొచ్చారు. తరుచుగా రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పారు. 
 
ధాన్యం నాణ్యతా పరిశీలనలో రైతులు మోసాలకు గురికాకూడదని, ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వం నుంచే ఎగుమతులు చేసేలా చూడాలని జగన్ తెలిపారు. ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కూడా కనీసంగా ఐదుగురు సిబ్బంది ఉండాలని జగన్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు