వామపక్ష తీవ్రవాదంపై 26న ముఖ్య‌మంత్రుల స‌మావేశం...ఏం మాట్లాడాలి?

శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (14:58 IST)
వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలోని పలుశాఖలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సెప్టెంబరు 26న సమావేశం జ‌రుగ‌నుంది. ఇందులో ఏపీ నుంచి సీఎం జ‌గ‌న్ ఏం మాట్టాడాలి అనే అంశంపై చ‌ర్చ జరిగింది. 
 
కేంద్ర హోంశాఖ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నేపథ్యంలో క్యాంపు కార్యాలయంలో హోం, గిరిజన సంక్షేమంతో పాటు వివిధ శాఖల అధికారులతో సీఎం వైయస్‌.జగన్‌ సమావేశం అయ్యారు. తీవ్ర‌వాదాన్ని ఏ కోణంలోనూ అంగీక‌రించేది లేద‌ని, దీనిపై గ‌ట్టి నివేదిక‌ను సిద్ధం చేసి, ముఖ్య‌మంత్రుల స‌మావేశంలో వెల్ల‌డించాల‌ని సీఎం జ‌గ‌న్ సూచించారు.
 
 
ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పాముల పుష్పశ్రీవాణి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ప్రిన్స్‌పిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ ఎన్‌ ప్రతీప్‌ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ట ద్వివేది, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌ రంజిత్‌ భాషా, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

వెబ్దునియా పై చదవండి