కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం నుండి అధీకృత గుర్తింపు లేని ఆసుపత్రిలు, ఆర్.ఎం. పి . లు వద్దకు కోవిడ్ లక్షణాలతో వచ్చే రోగులను ప్రభుత్వం గుర్తించిన కోవిడ్ ఆసుపత్రిలకు వెళ్లి చికిత్స తీసుకోవాలని సలహా ఇచ్చి పంపాలని, అలాకాకుండా కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
కోవిడ్ వ్యాధికి గుర్తింపు లేని ప్రైవేట్ ఆసుపత్రులు , ఆర్.ఎం.పిలు చికిత్సలు అందిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి వారిపై గట్టి నిఘా పెట్టవలసి ఉందన్నారు. ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ, రెవిన్యూ, పోలీస్ అధికారులు గట్టి నిఘా పెట్టి, అనుమానితులపై దాడులు నిర్వహించాలన్నారు.