విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి మరో ఘనత సాధించింది. కరోనా సోకి వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్న గర్భిణీకి సిజేరియన్ ద్వారా డెలివరీ చేశారు. గత పదిరోజుల క్రితం ఓ గర్భిణీ కరోనాతో కేజీహెచ్ ఆసుపత్రిలో చేరింది. అప్పటికే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడంతో వెంటిలేటర్ సాయంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆమెకి నెలలు నిండడంతో డెలివరీ చేయాల్సి వచ్చింది.
దీంతో డాక్టర్ ఎ.కవిత నేతృత్వంలోని బృందం సీఎస్ఆర్ బ్లాక్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స పురుడుపోశారు. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ గర్భిణీలకు సిజేరియన్ చేయగా పది రోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న కొవిడ్ బాధితురాలైన గర్భిణికి ఈ తరహాలో శస్త్ర చికిత్స నిర్వహించడం రాష్ట్రంలోనే ఇదే ప్రథమమని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలపగా గర్భిని కుటుంబం వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.