టెలీకాన్ఫరెన్స్‌లో కోవిడ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్, కొవిడ్ వ్యాక్సినేషన్ అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్, డియంహెచ్‌వో యం.సుహాసిని, డిపివో సాయిబాబా, జడ్పీ సీఈవో సూర్యప్రకాష్, అదనపు డియంహెచ్‌వో ఉషారాణి, డిఐవో తదితర అధికారులతో కలెక్టర్ ఇంతియాజ్ సమీక్షించారు.
కొవిడ్ పట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకుండా మార్గదర్శకాలన తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. మాస్క్ ధరించడం, చేతులు శుభ్రపరచుకోవడం, భౌతిక దూరం పాటించడం కొనసాగించాల్సి ఉందన్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు.
అత్యవసర ప్రయాణాలు తప్ప ఇతర ప్రయాణాలను నియంత్రించుకోవాలని పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందించడం జరుగుతుందన్నారు.
అయితే ప్రస్తుతం 60 సంవత్సరాలు వయస్సు నిండిన వారికి, 45-59 సంవత్సరాలలోపు వయసు కలిగి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సినేషన్ అందించడం జరుగుతుందన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ పొందేందుకు ముందుకు రావాలన్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ ఎంతో సురక్షితమని ఆయన స్పష్టంచేశారు. వ్యాక్సినేషన్ పొందే విషయంలో ఎటువంటి అపోహలకు తావు లేదన్నారు. వ్యాక్సిన్ సైట్స్ ప్లానింగ్, 48 గంటల ముందుగా ప్లానింగ్ చేసి లబ్దిదారులకు మేసేజ్ పంపి ఫోన్ ద్వారా మాట్లాడి వారిని సెషన్ సైట్‌కు వచ్చి వ్యాక్సిన్ వేసుకునే విధంగా వైద్య ఆరోగ్య సిబ్బందితో లైన్ డిపార్ట్మెంట్స్ జిల్లా అధికారులందరు సమన్వయం చేసుకోవాలన్నారు.
హెల్త్ కేర్ వర్కర్లు, లైన్ డిపార్ట్మెంట్ స్టాఫ్, రెవెన్యూ, పంచాయితీ, మునిపిపల్ పరిధిలో వ్యాక్సిన్ శాతం పెరగాలన్నారు. కోవిడ్ కేసుల నమోదు సంబంధించి కాంటాక్ట్ ట్రేసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టలన్నారు.