తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు.. అక్టోబర్ 13, 14 తేదీల్లో..?

శనివారం, 9 అక్టోబరు 2021 (14:35 IST)
గులాబ్ తుఫాన్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత బీభత్సం సృష్టించిందో తెలిసిందే. ఈ తుఫానును ప్రజలు ఇంకా మరిచిపోకముందే వాతావరణ శాఖ మరో షాకింగ్ విషయం తెలిపింది. బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
అక్టోబర్ 13, 14 తేదీల్లో బంగాళాఖాతంలో ఈ తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను 15న తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. ఈ తుఫాను కారణంగా తెలంగాణలో మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
 
తుఫాను ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో ఆదివారం కురిసిన వర్షాలకు రోడ్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వాన నీరు చేరింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు