రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

ఠాగూర్

సోమవారం, 28 జులై 2025 (17:24 IST)
కన్నడ నటి రమ్యకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. "రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది.. అత్యాచారం చేస్తాం అంటూ బెదిరించారు" అంటూ ఆమె ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై తన న్యాయవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆమె తెలిపారు. 
 
నటుడు దర్శన్ అభిమానులు తనను ఆన్‌లైన్‌లో వేధిస్తున్నారంటూ నటి రమ్య (దివ్య స్పందన) ఆవేదన వ్యక్తంచేశారు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను ఇలా ఉపయోగించడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ అత్యాచార బెదిరింపులు రావడం దారుణమన్నారు. 
 
'ఈ బెదిరింపులపై నా లాయర్ ఇప్పటికే చర్చించాను. నాకు వచ్చిన బెదిరింపులు మెసేజ్‌లను పోలీసుల దృష్టికి తీసుకెళ్తాను. ఆ కామెంట్స్ చేసిన వారిపై ఫిర్యాదు చేస్తాను' అని తెలిపారు. గతంలోనూ ఆమె ఇలాంటి వేధింపుల గురించి మాట్లాడారు. ఇలా చేసే వారు తప్పించుకుని తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కామెంట్స్ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. 
 
రేణుకాస్వామి హత్య కేసుపై రమ్య ఇటీవల ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌కు దర్శన్ అభిమానులు తనకు అసభ్యకరమైన కామెంట్స్ పెట్టారని నటి తెలిపారు. 'రేణుకాస్వామికి బదులుగా నిన్ను హత్య చేసి ఉండాల్సింది. అత్యాచారం చేస్తారం' అంటూ ఎంతోమంది నటుడి అభిమానులు తనకు మెసేజ్‌లు పంపినట్టు చెప్పారు. 
 
ఆ మెసేజ్‌ల స్క్రీన్ షాట్‌లను కూడా ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు. తన కుటుంబ సభ్యులను కూడా వారు వదలడం లేదని బాధపడ్డారు. అభిమన్యు సినిమాతో తెలుగువారికి పరిచయమైన నటి రమ్య... ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు