గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో కట్టడాల కూల్చివేతలు ప్రారంభమైంది. జేసీబీలతో 8 కట్టడాల కూల్చివేతలను చేపట్టారు. దీంతో ఇప్పటంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రోడ్డు విస్తరణ పేరుతో గతంలోనే ఇళ్ల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. అప్పట్లో ఈ అంశం వివాదాస్పదం అయ్యింది.
తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పొలాలకు వెళ్లిన సమయంలో ఇంటి ప్రహరీ గోడలు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.