చంద్రగిరి ప్రజలకు 1,60,000 బాటిళ్ల మల్టీ విటమిన్ సిరప్‌లు పంపిణీ.. ఎవరో తెలుసా?

గురువారం, 11 జూన్ 2020 (19:28 IST)
చంద్రగిరి నియోజకవర్గంలోని 1,60,000 కుటుంబాలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి మరోమారు భారీ స్థాయిలో వితరణ ప్రక్రియ చేపట్టి చేయోతనందించారు.

చంద్రగిరిలో 1,60,000 కుటుంబాలకు ఒక్కో సిరప్ చొప్పున 1,60,000 బాటిళ్ల ను చెవిరెడ్డి పంపిణీ చేశారు. అన్ని రకాల విటమిన్లతో కూడిన ఈ సిరప్(రాఫ్ విట్) ను వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికీ చేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

గురువారం ముక్కోటి సమీపంలోని నారాయణి గార్డెన్స్ వద్ద మల్టీ విటమిన్ సిరప్ ల పంపిణీ కార్యక్రమాన్ని చెవిరెడ్డి ప్రారంభించారు. ప్రత్యేకంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజలకు, వారి ఆరోగ్యానికి అవసరమైన సహకారం అందించడం శాసన సభ్యుడి హోదాలో బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాలను చేపట్టారు.

ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి శానిటైజర్లు, మాస్కులు, పండ్లు, కోడిగుడ్లు, సి - విటమిన్ టాబ్లెట్లు, నిత్యావసర సరుకులు, హోమియో మందులు అందజేశారు. వీటికి అదనంగా నియోజకవర్గ ప్రజలు ఆరోగ్య పరిరక్షణకు 1,60,000 కుటుంబాలకు మల్టీ విటమిన్ సిరప్ లను అందజేశారు.

నియోజకవర్గాన్ని అభివృద్ధిలో నే కాదు.. ప్రజలకు అవసరమైనప్పుడు, ప్రజలు అడగకనే అన్ని రకాల అవసరాలను తీరుస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి కి నియోజకవర్గ ప్రజలు అభినందనలు తెలిపారు. 
 
జగనన్న స్పూర్తితోనే: చెవిరెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో నా నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాను. ఈ కరోనా వంటి వైరస్ లు విటమిన్ లోపాలున్నా వారికి ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. పల్లెల్లోని ప్రజలు ఎవరికి ఏ విటమిన్ లోపం ఉందో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది.

భవిష్యత్తులో ఏ విధమైన అనారోగ్య సమస్య తలెత్తకుండా ఉండేలా అన్ని రకాల విటమిన్ లతో కూడిన ఈ మల్టీ విటమిన్ సిరప్ ను అందజేసినట్లైతే.. అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగి ఏ వైరస్ లు మన దగ్గరకు రావు.

ప్రముఖ వైద్యనిపుణుల సూచనల మేరకు ఈ మల్టీ విటమిన్ సిరప్ లను ప్రజలకు అందిస్తున్నాము. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు యోగా చేసేందుకు ఆశనాలతో కూడిన బుక్ ను త్వరలో ప్రజలకు అందించనున్నాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు