వాలంటైన్స్ డే సందర్భంగా ఈ జంట చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇద్దరూ ఒకరికి ఒకరు లవ్ ప్రపోజ్ చేసుకోవడం, ఇంకా ప్రేమ ఊసులు, చేసుకున్న బాసలు, ఇచ్చుకున్న కానుకలు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఇకపోతే.. మాధురి ఒక డ్యాన్సన్ టీచర్ అని.. మాధురిని తనకు పరిచయం చేసింది తన భార్య వాణియేనని దువ్వాడ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నానని దువ్వాడ చెప్పారు. తన కుమార్తెలను చూసుకునే బాధ్యత తనదేనని తెలిపారు. తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అన్నీ తానై తనకు మాధురి సపర్యలు చేసిందని వెల్లడించారు.