కాగా హయత్‌నగర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో సతీష్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రుల అనుమతి లేకుండానే సతీష్‌ను కళాశాల యాజమాన్యం బయటకు పంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.