ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 'విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రశ్నే లేదు. కాకపోతే ఈ విషయం వెల్లడించడానికి ప్రధాని నరేంద్ర మోడీ అనుమతి కావాలి. ముందు ప్రధానితో మాట్లాడి ఒప్పించాల్సి ఉంది. అందుకోసం మేము విస్తృతంగా చర్చించాం.
ప్రధాని మోడీ ఆశీస్సులతో నెలన్నరలో ప్లాంటు పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుంది' అని కేంద్రమంత్రి హెచ్ఐ కుమారస్వామి కార్మిక, ఉద్యోగసంఘాల నేతలకు భరోసా ఇచ్చారు. ఉక్కు కర్మాగారం ఉత్పాదన తీరును సీఎండీ అతుల్భట్ వారికి వివరించారు. ఈడీ వర్క్స్ భవనంలోని మోడల్ గదిలోని గ్యాలరీలో ఉంచిన అవార్డులను పరిశీలించి సిబ్బందిని అభినందించారు.