డబల్ బైపాసు ఆపరేషన్... అదీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో!

గురువారం, 23 డిశెంబరు 2021 (16:09 IST)
క‌ర్నూలు జిల్లా నంద్యాలలో చాపల వ్యాపారం చేసుకొని సంసారాన్ని అతి కష్ఠంగా నెట్టుకొస్తున్న 69 ఏళ్ళ హుసేన్ కు కష్టం అమాంతం ఆయాసం రూపంలో వచ్చింది. కూర్చోలేడు, నిలబడలేడు, కడుపు మంట పరీక్ష చేసిన వారు గుండె జబ్బేమో కర్నూలు పెద్దాసుపత్రికి పోండి అన్నారు. చెప్పడం సులభమే.. కాని కర్నూలుకు రావడం కష్ఠమే. ఎలాగోలా ప్రాణాలరచేతులో పెట్టుకొని ఆఘమేఘాల మీద కర్నూలు సర్వజన వైద్యశాల కొచ్చారు. కార్డియాలజీ విభాగంలో చేర్చారు, మూడు రోజుల తరువాత బ‌తికి బయటపడ్డాడు. 
 
 
ఆంజియోగ్రామ్ చేయడంతో మూడు వెజల్సు బ్లాక్ అయ్యాయి. బైపాసు చేయాలి స్టెంటు వేయలేమని తెలిపారు. ఆయాసం తగ్గినట్లే తగ్గినా పూర్తి తగ్గకపోవడంతో మరలా ఎకో పరీక్షలు చేయగా, మైట్రల్ వాల్వు పూర్తిగా లీకవతోంది. ఎజెక్షన్ ఫ్రాక్షన్ 25 ఉంది. బేసు కదలడం లేకపోవడం వల్ల వాల్వు సమస్య కూడా వచ్చింది.
 
 
ఇపుడు అతనికి డబల్ బైపాసు ఆపరేషన్ చేయాలంటే కొరోనరీ రక్తనాళాల బైపాసుతో పాటు మైట్రల్ వాల్వు రీప్లేసు చేయాలి. ఎజెక్షన్ ఫ్రాక్షను తక్కువగా ఉండడంతో హైరిస్కు, చాలా ఖరీదయిన ఆపరేషన్ అని తెలియడంతో అయోమయంలో పడ్డాడు.
 
 
కార్డియోధొరాసిక్ విభాగం దృష్టి కి రావడంతో ఆరోగ్యశ్రీ కింద స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆపరేషనుకు రెడీ చేసారు. నాలుగు బాటల్ రక్తం రెడీ చేసారు. మత్తు మందు వైద్యులు చకచకా రెడీ చేసుకున్నారు. ఈ నెల 15న ఈ డబల్ బైపాస్ ఆపరేషన్ చేశారు. బైపాసు దానికి తోడు మైట్రల్ వాల్వు మార్చడం జరిగింది.  ఇటువంటివి ఇప్పటికే 7 ఆపరేషన్లు ఇక్కడ చేసారు. ఆపరేషను సక్సెసు అయింది. పోస్టు ఆపరేషన్ బాగా రికవరీ అయింది. మత్తు మందు వైద్యులు కొండారెడ్డి, రాఘవేంద్ర వారి టీము బాగా సహకరించారు. ప‌ది  మంది సిటి టీము నర్సులు బాగా సేవలందించారు. పేషెంటు వారం రోజుల్లో కోలుకొని ఇంటికి వెళ్ళడానికి సిద్ధం అయ్యాడు. ఆరోగ్యశ్రీ, ప్ర‌భుత్వ సర్వజన వైద్యకళాశాల కర్నూలు కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ వైద్య సిబ్బంది సేవలు గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు. 
 
 
ఇప్పటికే 450 మందికి పైగా బైపాసులు ప్రభుత్వ ఆసుపత్రి లో నిరంతరాయంగా 4 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాయి. ఎన్నో క్లిష్టమైన అన్ని గుండె ఆపరేషన్లు ఇక్కడ ఆరోగ్యశ్రీ లో ఉచితంగా జరుగుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు