జూలై నుండి మచిలీపట్నంకు ప్రతి రోజు తాగు నీరు: మంత్రి పేర్ని నాని
శనివారం, 9 మే 2020 (19:42 IST)
జూలై నెలనుండి మచిలీపట్నం పుర ప్రజలకు ఇప్పటివలే రోజు విడిచి రోజు కాకుండా ప్రతిరోజూ స్వచ్ఛమైన మంచినీరు అందిస్తామని రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని)తెలిపారు.
ఇక నుంచి మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్వచ్ఛమైన తాగునీరు పంపిణీ కానుందని ఆయన అన్నారు.
స్థానిక రాజుపేట కేశవరావు తోట ప్రాంతం లో నూతనంగా నిర్మించిన రాపిడ్ సాండ్ ఫిల్టర్స్ సముదాయాన్ని మంత్రి నిరాడంబరంగా ప్రారంభించారు.
ఈ విధానంతో పట్టణ ప్రజలకు సమృద్ధిగా పరిశుభ్రమైన తాగునీరు సరఫరా కానుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలకసంస్థ కమీషనర్ శివరామకృష్ణ, ఎంఇ త్రినాధ్ రావు, డీఇ, ఏఇ లు, సిబ్బంది పాల్గొన్నారు.