పరిశ్రమల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులు, కొత్త పోర్టుల ప్రతిపాదనలపై సమీక్షించారు. దుగరాజపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, నక్కపల్లి, కళింగపట్నం, భావనపాడు పోర్టుల ప్రణాళికల తయారీకి ఆదేశించారు. తొలి దశలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
మచిలీపట్నం పోర్టుకు భూమి అందుబాటులో ఉండటంతో వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. మిగిలిన పోర్టుల నిర్మాణ స్థలాల్లో వెంటనే భూమి సేకరించాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు జూన్ కల్లా ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మే, జూన్ నాటికల్లా రెండుపోర్టులకూ శంకుస్థాపన చేస్తామని జగన్ చెప్పారు