నెల్లూరు కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ శ్రీకాంత్ వ్యవహారం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై వీడియోలో కనిపించిన బాధిత మహిళ తనుక ఒక ఖైదీకి కేర్ టేకర్‌గా ఉన్నాననీ, అతడి ఆరోగ్యం కోసం ఆ ఖైదీని ఆలింగనం చేసుకుంటే తప్పేంటి? అంటూ ఓ ప్రైవేట్ ఛానల్‌తో మాట్లాడుతూ ప్రశ్నించారు.
ఆసుపత్రిలో అతనితో క్రీమ్ రాయించుకుని మసాజ్ చేయించుకుంటే తప్పేంటి? ఇలాంటివి దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి లాంటోళ్ళు పబ్లిక్‌గా చేస్తే తప్పు లేదు గానీ, నేను చేస్తే తప్పెలా అవుతుంది? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.