హైపవర్ కమిటీ ఏర్పాటు.. రేపు ఏపీ రాష్ట్రమంత్రివర్గ సమావేశం

గురువారం, 26 మార్చి 2020 (19:11 IST)
నిత్యావసరాలు రవాణా దుకాణాలకు చేరవేయటంపై ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. మార్కెటింగ్ సెక్రటరీ ఆధ్వర్యంలో హైపవర్‌ కమిటీ ఏర్పాటైంది. నిత్యావసర వస్తువుల వివరాలను వెల్లడిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం రేపు జరగనుంది. మూడు నెలల బడ్జెట్కు సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.

కరోనా భయాందోళనలు, కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో సామాజిక దూరం పాటించేలా మొదటి బ్లాక్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించనున్నారు. మూడు నెలల బడ్జెట్‌కు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానున్నారు.

జూన్ 30 వరకు అవసరమైన నిధులకు ఆర్డినెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కేబినెట్‌ ఆమోదం తర్వాత గవర్నర్‌కు ఆర్డినెన్స్‌ను పంపేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. కేబినెట్‌ ఆమోదం తర్వాత గవర్నర్‌కు ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం పంపనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు