నిరాశ్రయుల గుర్తింపు కోసం ప్రభుత్వ కమిటీ ఏర్పాటు

శుక్రవారం, 4 అక్టోబరు 2019 (07:32 IST)
పట్టణాలు, నగరాల్లో నిరాశ్రయులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.

నివేదికను నెల రోజుల్లో ప్రభుత్వానికి అందజేయాలన్నారు. విజయవాడలో మున్సిపల్ కమిషనర్లు, పీడీలు, మెప్మా సంచాలకుల రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ కార్యదర్శి శ్యామలారావుతోపాటు మన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్ హాజరయ్యారు.

పట్టణాలు, నగరాల్లో నిరాశ్రయులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు మంత్రి బొత్స ఆదేశాలు జారీ చేశారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు, ఎన్జీవోలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కమిటీ నిరాశ్రయుల గుర్తింపు, ఆశ్రయం కల్పించటానికి విధివిధానాలు తయారు చేయనుంది. అనంతరం నివేదికను నెలరోజుల్లో ప్రభుత్వానికి అందజేయనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు