పార్టీలో చేరికపై మాట్లాడిన కాటసాని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో పాణ్యం నియోజవర్గం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలసి నడవడం తన అదృష్టమన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్రం ప్రభుత్వం విఫలమైందని కాటసాని ఈ సందర్భంగా ఆరోపించారు.