తిరుమలకు వెళ్లే భక్తులకు రెండు నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం అందుబాటులో ఉండదని టీటీడీ అధికారులు ప్రకటనలో చెప్పారు. తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు జూన్ 1 2021, నుంచి జూలై 31 వరకు ఆ మార్గాన్ని మూసివేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని, అటు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో అలిపిరి చెక్ పాయింట్ వద్ద ఇవాళ్టి నుంచి ఫాస్టాగ్ అమల్లోకి రానుంది. ఇప్పటికే తిరుమల-తిరుపతి మధ్య టాక్సీవాలాలతో సమావేశమైన అధికారులు ఫాస్టాగ్ అమలుపై సమీక్ష నిర్వహించారు. దీంతో పాటు పెంచిన కొత్త టోల్ చార్జీలను కూడా అమలు చేయనున్నట్లుగా తెలిపారు.