ఫాస్టాగ్‌లు కొనుగోలు చేయని వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మార్చి ఒకటో తేదీ వరకు ఉచితంగానే ఫాస్టాగ్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం టోల్ ప్లాజాల వద్దే కౌంటర్లను ఏర్పాటు చేయనుంది. అలాగే, ఫాస్టాగ్ ఆఫ్‌లైన్ రీచార్జ్ కోసం టోల్‌ప్లాజాల వద్ద 40 వేల పాయింట్ ఆఫ్ సేల్స్(పీవోఎస్) యంత్రాలను అందుబాటులో పెట్టినట్లు వెల్లడించింది.
నగదు నిల్వలు ఆకుపచ్చ, కాషాయం, ఎరుపు రంగుల్లో ఉంటాయని తెలిపింది. ఆకుపచ్చ రంగు ఉంటే తగినన్ని నిల్వలు ఉన్నాయని, కాషాయం రంగు ఉంటే నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఎరుపు రంగులో ఉంటే బ్లాక్‌లిస్టులో ఉన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది.