అయితే కొంతమంది టిడిపి నేతలు మాత్రం ఇదంతా చంద్రబాబునాయుడు మీద ఉన్న వ్యతిరేకత అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పటికీ నడుస్తూనే ఉంది. కానీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు, నారా లోకేష్ కన్నా ఇప్పుడు వేరే నాయకుడు అవసరమని టిడిపి నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.
సినిమాల్లో చేస్తూనే టిడిపి పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి జూనియ్ ఎన్టీఆర్ ఒక్కరే సరైన నాయకుడన్న ఆలోచనలో ఉన్నారట టిడిపి నేతలు. అయితే నేతలు కలిసినప్పుడు వారికి నచ్చజెప్పి పంపించేద్దామన్న ఆలోచనలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారట. మరి చూడాలి... జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసే టిడిపి నేతలపై చంద్రబాబు ఏవిధంగా వ్యవహరిస్తారన్నది.