ఏపీలో ఫైర్ నెట్ చార్జీల బాదుడు

శుక్రవారం, 6 మార్చి 2020 (09:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫైబర్ నెట్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో కనెక్షన్‌పై రూ.55 మేర పెంచారు. చార్జీల పెంపు అనంతరం పన్నుల మినహా ఫైబర్ నెట్ నెలవారీ చార్జీ రూ.204కి చేరింది. ఒక్కో ఫైబర్ నెట్ కనెక్షన్ కు రూ.230 మేర ప్రభుత్వంపై భారం పడుతోంది. 
 
ఏపీ ప్రస్తుతం 8.3 లక్షల పైచిలుకు ఫైబర్ నెట్ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు రూ.13 కోట్ల వరకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక భారం మోస్తోంది. తాజాగా రూ.55 పెంచడంతో రూ.3 కోట్ల మేర భారం తగ్గనుంది. నష్టాల భయంతో కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు