పైగా, రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో సుమారుగా 50 శాతం కేసులు కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోనే నమోదుకావడం గమనార్హం. పైగా, ఈ కరోనా మహమ్మారి పిసిపిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు. నెల్లూరులో బుధవారం ముగ్గురు చిన్నారులకు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా, అనంతపురం జిల్లాల ఇద్దరు వైద్యులకు ఇద్దరు సిబ్బందికి ఈ వైరస్ సోకింది.
ఇదిలావుంటే, మాస్కు అడిగినందుకు నర్సీపట్నం ప్రైమరీ హెల్త్ సెంటరులో పని చేసే ఓ వైద్యుడిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. "మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ ని సస్పెండ్ చెయ్యడం సీఎం జగన్ మూర్ఖత్వానికి పరాకాష్ట.వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వలనే డాక్టర్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. అనంతపురంలో ఇద్దరు డాక్టర్లు, ఇద్దురు వైద్య సిబ్బందికి కరోనా సోకింది అంటే ఇక ప్రజల పరిస్థితి ఏంటి?"
"కరోనా నివారణకు ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు మాస్కులు, వ్యక్తిగత రక్షణ కిట్లు ప్రభుత్వం ఇవ్వకపోవడం వలనే డాక్టర్లకు కరోనా సోకింది. దీనికి బాధ్యత వహించేది ఎవరు? ఈ పరిస్థితి కి కారణం అయిన వారిపై ప్రభుత్వం ఎం చర్యలు తీసుకుంటుంది?" అంటూ తన ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు.