రూ.కోటి దుర్వినియోగం... ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సస్పెన్షన్

ఠాగూర్

బుధవారం, 4 డిశెంబరు 2024 (08:57 IST)
నిధుల దుర్వినియోగం కేసులో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెడ్ చేసింది. పైగా, విజయవాడ నగరం వదిలి వెళ్లొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఐపీఎస్ అధికారి అయిన సంజయ్ గత వైకాపా ప్రభుత్వంలో సీఐడీ చీఫ్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో వైకాపా పెద్దలతో అంటకాగి, ఇష్టానురీతిలో రెచ్చిపోయారు. అనేక రకాలైన అవినీతి చర్యలకు పాల్పడ్డారు. ఈ విషయం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. 
 
సీఐడీ చీఫ్‌గా సంజయ్ బాధ్యతలు చేపట్టకముందు అగ్నిమాపకదళ విభాగం డీఐజీగా పని చేశారు. ఆ సమయంలో ఆయన రూ.కోటి మేరకు నిధులను దుర్వినియోగం చేసినట్టు విజిలెన్స్ శాఖ నిర్ధారించింది. చేపట్టిన పనులు పూర్తి చేయకుండానే భారీ మొత్తంలో చెల్లింపులు చేసినట్టు గుర్తించింది. సౌత్రిక టెక్నాలజీసి అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి సంజయ్.. ఈ మేరకు దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలిసింది. 
 
దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా సంజయ్‌పై సర్కారు సస్పెన్షన్ వేటు వేసింది. సంజయ్ ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీచేసింది. దళితులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమాల పేరిట ఆయన దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఆయనను ఏపీ ప్రభుత్వం తాజాగా సస్పెండ్ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు