Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

ఐవీఆర్

మంగళవారం, 13 మే 2025 (23:20 IST)
మాటలు తూటాలు పేల్చడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో కొందరు నేతలు గుర్తింపు తెచ్చుకుంటుంటారు. అలాంటి వారిలో వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ఒకరు. ఐతే తెదేపా కార్యాలయంపై దాడి, సత్యవర్థన్ కిడ్నాపు కేసుల్లో అరెస్టయిన వల్లభనేని వంశీ మంగళవారం నాడు గుర్తుపట్టలేని విధంగా కనిపించారు. నడకలోనూ కాస్తంత తేడా కనిపిస్తుండగా తీవ్రంగా దగ్గుతూ, రొప్పుతూ కనిపించారు. అసలాయన వల్లభనేని వంశీయేనా అనే అనుమానం సైతం కలుగుతుంది. వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయనను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించనున్నారు. ఆ సమయంలో ఆయన పోలీసు వాహనం ఎక్కేందుకు వస్తూ కనిపించారు. తీవ్రంగా దగ్గుతూ కనిపించారు.
 
మరోవైపు వంశీ తనకు ఆరోగ్యం బాగోలేదనీ, బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో అభ్యర్థించారు. దీనితో విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

"అసలు వడ్డీతోటి సిసలు ఫలితంబు అనుభవించుట తథ్యం" pic.twitter.com/rNDGfsVfXQ

— Anjan P (@pdsdnn) May 13, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు