ఒకేసారి నాలుగు అతి పొడవైన రైళ్లను నడిపిన దక్షిణ మధ్య రైల్వే

ఆదివారం, 17 అక్టోబరు 2021 (14:57 IST)
దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో మూడు వేర్వేరు గమ్యాలకు నాలుగు అతి పొడవైన రైళ్లను విజయవంతంగా నడిపించింది.  ఈ వినూత్న విధానానికి పవిత్ర మూడు (లేదా అంతకంటే)  నదుల సంగమంగా భావించే  ‘త్రివేణి’ అని పేరు పెట్టారు.

ఈ ప్రత్యేక వినూత్నమైన చొరవ విజయవాడ డివిజన్‌ వారిచే నిర్వహించబడి, ఒకే రోజు నాలుగు అతి పొడవాటి  రైళ్లుగా నడిపించారు. ప్రతి పొడవాటి భారీ రైళ్లలో రెండు గూడ్స్‌ రైళ్లు జతచేయబడ్డాయి మరియు ఈ గూడ్స్‌ రైళ్లు సాధారణ సరుకు రవాణా రైళ్ల కంటే రెండిరతలు పొడవుగా ఉంటాయి. ఇవి కీలకమైన సెక్షన్లలో సామర్థ్య నిర్వహణ పరిమితుల సమస్యలను పరిష్కరించడంలో అత్యంతం ప్రభావం చూపుతాయి.

నాలుగు భారీ రైళ్లలో, రెండు రైళ్లలో ఒక్కొక్క దానిలో 118 ఓపెన్‌ వ్యాగన్లు (58 G58 బాక్స్‌ ఎన్‌ వ్యాగన్లు) కలిగున్నాయి, సుమారు 900 కిమీలు విజయవాడ నుండి విశాఖపట్నం వైపు తాల్చేర్‌ వరకు రవాణా అయ్యాయి. మరో పొడవాటి రైలు రెండు ఓపెన్‌ వ్యాగన్‌ రైళ్లతో (ప్రతి దానిలో 59G59 బాక్స్‌ ఎన్‌ వ్యాగన్లు కలిగున్నాయి) జతపరచబడి అదాని కృష్ణపట్నం పోర్టు నుండి ఓబులవారిపల్లి మీదుగా 645 కిమీల దూరం గల కేసోరామ్‌ సిమెంట్‌కు రవాణా అయ్యింది. 

మూడో దిశలో విజయవాడ నుండి కొండపల్లి వరకు బిసిఎన్‌ రేక్స్‌ కలిగిన రెండు రైళ్ల కవర్డ్‌ వ్యాగన్లను జతపరిచి రవాణా చేయడం జరిగింది. ఈ నాలుగు భారీ రైళ్లు విజయవాడ నుండి మూడు వేర్వేరు గమ్యాలకు రవాణా అయ్యాయి. 
ఈ వినూత్న పద్దతి గూడ్స్‌ రైళ్ల నిర్వహణలో వేగాన్ని పెంచడానికి తోడ్పడ్డాయి. ఈ ప్రక్రియతో ఖాళీ మరియు లోడ్‌ అయిన వ్యాగన్లు వాటి గమ్య స్థానాలకు లోడిరగ్‌/అన్‌లోడిరగ్‌కు తక్కువ సమయంలో చేరుతాయి.

దీంతో సరుకు రవాణా వినియోగదారుల అవసరాలను కూడా తీర్చబడుతాయి. అతి పొడవాటి రైళ్లను నడపడం ద్వారా వ్యాగన్‌ రాకపోకల సమయం తగ్గడంతో పాటు సరుకు రవాణా లోడిరగ్‌ అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది.  దీనికి అదనంగా, రెండు రైళ్లను జతపరిచి ఒక రైలుగా చేయడంతో సిబ్బంది అవసరం కూడా తగ్గుతుంది. దీంతో వీరిని రైళ్ల రద్దీ ప్రాంతాలలో ఇతర రైళ్ల నిర్వహణలో వినియోగించుకోవచ్చు.

రెండు రైళ్లను ఒకే రైలుగా నడపడంతో రద్దీ మరియు కీలకమైన సెక్షన్లలో ముఖ్యమైన మార్గలలో ఇతర రైళ్ల నిర్వహణలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. భారీ రైళ్లను నడపడంతో రైళ్ల మార్గంలో రద్దీని తగ్గించడంతో రైళ్ల నిర్వహణ సామర్థ్యం పెంపుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సరుకు రవాణా రైళ్ల సగటు వేగం పెరగడానికి తోడ్పడుతుంది.
 
వినూత్న పద్దతిలో సరుకు రవాణా రైళ్ల నిర్వహణను చేపట్టి సరుకు రవాణా సామర్ధ్యం పెంపొందుకు కృషి చేస్తున్న  విజయవాడ డివిజన్‌ అధికారులను మరియు సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య ప్రత్యేకంగా అభినందించారు.

భారీ రైళ్లను నడపడం ద్వారా రోలింగ్‌ స్టాక్‌ నిర్వహణలో రైల్వేకి ఉత్తమంగా తోడ్పడుతుందని మరియు తక్కువ సమయంలో భారీ స్థాయిలో సరుకుల రవాణాకు ప్రయోజకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు