పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)

ఠాగూర్

శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (10:09 IST)
హైటెక్ ప్రపంచంలో మన సంస్కృతీ సంప్రదాయాలు మంటగలసిపోతున్నాయి. ముఖ్యంగా, నేటి యువతీ యువకులు విచ్చలివిడిగా ప్రవర్తిస్తున్నారు. వారిలో ఏమాత్రం సిగ్గు అన్నది కనిపించడం లేదు. ఫలితంగా బహిరంగంగానే వారు ఇతరులు చూడలేని విధంగా అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఈ వీడియో ఓ యువతి తన భర్తతో అందరి మందు ఏమాత్రం సంకోచం, బిడియం లేకుండా ఎలా అధర చుంభనం చేసిందో చూడండి. 
 
నిజానికి వివాహ వేడుకల్లో పెళ్లి తంతులోభాగంగా వధూవరులతో సంప్రదాయబద్ధంగా కొన్ని పనులను పూజారులు దగ్గరుండి చేయిస్తుంటారు. అలాంటివాటిలో వధూవరులు ఒకరి కాలి బొటనవేలు తొక్కడం, బిందెలో ఉంగరం తీయడం, శోభనం గదిలో పూలబంతులాట ఇలాంటి పనులు చేస్తుంటారు. అయితే, ఈ వీడియోలో మాత్రం తన భర్త నోట్లో పెట్టుకున్న స్వీట్‌ను భార్య అధర చుంభనం చేసి తీయడం కనిపిస్తుంది. ఆ సమయంలో వారి పక్కనే అనేక మంది మహిళలు కూర్చొనివున్నారు. వీరిలో కొందరు వృద్ధులు కూడా ఉన్నారు. 

 

నాకు తెలిసి పెళ్లి లో కాలు తొక్కటం, ఉంగరం తీయటం తెలుసు, దానితో పాటు బంతులాట ఆడతారు

ఇదేమి విడ్డూరంరా పబ్లిక్ లో ???????????? pic.twitter.com/NGMbfF0yuI

— Ramesh- గ్యారీ గరికపాటి (@Garybabai) April 17, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు