వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. యువతిపై బావే అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటికి వచ్చిన బావకు ఆతిథ్యమిచ్చినందుకు ఆ యువతి తన శీలాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పైగా, ఈ అత్యాచారాన్ని చూసిన మరో ఇద్దరు కూడా ఆ యువతిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి తెగబడ్డారు. వరంగల్ జిల్లా కాజీపేటలో శనివారం అర్థరాత్రి ఈ వివరాలను పరిశీలిస్తే..
అంజయ్య తోడుగా ఉంటాడన్న నమ్మకంతో మల్యాల గ్రామంలోని బంధువుల ఇంటికి బయలుదేరింది. వీరు సికింద్రాబాద్‌లో పుష్‌పుల్ రైలెక్కి కాజీపేటలో శనివారం రాత్రి 10-30 గంటలకు దిగారు. మల్యాల వెళ్లేందుకు మరో రైలు ఎక్కాలని ఆమెకు చెప్పిన అంజయ్య.. రైలు పట్టాల వెంట టౌన్ స్టేషన్ సమీపంలోకి తీసుకొచ్చి అత్యాచారానికి ఒడిగట్టాడు. వీరిద్దరిని పసిగట్టిన మరో ఇద్దరు... ఆమెను బెదిరించి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కాజీపేట పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేసింది.