ప్రఖ్యాత ఘజల్ గాయకులు, ముమ్మారు గిన్నీస్ ప్రపంచ రికార్డుల విజేత, స్వచ్ఛ ఆంధ్రా బ్రాండ్ అంబాసడర్ డాక్టర్ ఘజల్ శ్రీనివాసుని శారదా సేవాసంఘం, విజయనగరం శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా "జ్ఞాన సరస్వతి పురస్కారం"తో సత్కరించనున్నారు.
విజయనగరం జ్ఞాన సరస్వతి ఆలయంలో 30 సెప్టెంబర్ 2017న సాయంత్రం 6.30 ని,లకు ఒక ప్రత్యేక కార్యక్రమములో సత్కరించనున్నట్లు సంస్థ అధ్యక్షులు శ్రీ జి.శివకుమార్, కార్యదర్శి శ్రీ సీహెచ్. శ్రీధర్ తెలిపారు.