సోమవారం రాజమండ్రిలో టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను గోరంట్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించాయి. ఈ సందర్భంగా గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 40 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని ఇప్పుడు వైసీపీ దమనకాండను ఎదుర్కొంటోందని చెప్పారు.