చావుల్లో రకాలు చూపుతూ డబ్బులు దండుకుంటున్నారు. సాధారణ చావుకైతే రూ.2,200, కరోనా మరణానికైతే రూ.5,100 రేటు కట్టి మరీ దోచుకుంటున్నారు. ఇలా సాక్షాత్తు గుంటూరు నగర పాలక సంస్థే చేస్తున్నట్లు కనిపిస్తోంది.
అయితే, గుంటూరు నగరంలోని శ్మశానాల్లో అంత్యక్రియల ఖర్చులకు, నగరపాలక సంస్థకు ఎటువంటి సంబంధం లేదని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ ఆదివారం తెలిపారు. అంత్యక్రియల ఖర్చుల సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని శ్మశాన వాటిక కమిటీ ప్రతినిధులను ఆదేశించామన్నారు.