గుంటూరులోని జిన్నా టవర్ మరోమారు తెరపైకి వచ్చింది. ఈ టవర్‌పై ఉన్న జాతీయ జెండాను గుర్తుతెలియని వ్యక్తులు కొందరు తొలగించారు. దీంతో జిల్లా కేంద్రమైన గుంటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కాగా, జిన్నా టవర్ పేరును మార్చాలంటూ గత కొన్ని రోజులుగా బీజేపీ ఏపీ శాఖ శ్రేణులు, నేతలు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఈ టవర్‌కు అబ్దుల్ కలాం టవర్‌గా పేరు పెట్టాలంటూ వారు డిమాండ్ చేస్తూ వచ్చారు.
ఈ నేపథ్యంలో ఈ వివాదం ముదరడంతో కార్పొరేషన్ అధికారులు జిన్నా టవర్‌కు జాతీయ రంగులు వేయించారు. అక్కడే జెండా దిమ్మను ఏర్పాటు చేసి జాతీయ జెండాను సైతం ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రితో సహా పలువురు నేతలు హాజరయ్యారు.
ఇపుడు దిమ్మెతో ఉన్న జాతీయ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం చరీ్చనీయాంశంగా మారింది. జిన్నా టవర్‌ను అడ్డుపెట్టుకుని బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందంటూ పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.