భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్. నరసింహారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతి కేంద్రంగా ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నియమించే పనిలో ఉన్న బిజెపి అగ్రనేతలందరూ ఈ ప్రాంతంలో ఉన్నారు. అయితే రెండు రోజుల రాష్ట్రకార్యవర్గ సమావేశం ముగిసిన తరువాత జి.వి.ఎల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీస్తోంది.
తెలంగాణాలో ఆ మధ్య జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సర్జికల్ స్టైక్ చేస్తానని చెప్పడం పెద్ద దుమారాన్నే రేపింది. ఇక ఎపిలో కూడా రెండు సర్జికల్ స్ట్రైక్‌లు చేయాల్సిన అవసరం ఉందని.. ముఖ్యంగా తిరుపతి లాంటి ప్రాంతంలో ఈ ట్విన్ సర్జికల్ స్ట్రైక్‌లు జరగాలని అభిప్రాయపడ్డారు జి.వి.ఎల్.నరసింహారావు.
టిడిపి, వైసిపిలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారాయన. వైసిపి దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతోందని.. వైసిపి మోసాలు, అక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. తిరుపతి ఎన్నికల్లో అభ్యర్థి విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. జనసేన, బిజెపి కలిసి చర్చలు జరుతున్నట్లు చెప్పారు.