జనసేన లేకుండా టీడీపీ గెలుపు అసాధ్యం : హరిరామజోగయ్య

ఠాగూర్

సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (18:09 IST)
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ లేకుండా తెలుగుదేశం పార్టీ గెలుపు అనేది అసాధ్యమని జనసేన పార్టీ సీనియర్ నేత హరిరామజోగయ్య జోస్యం చెప్పారు. పైగా, అధికారం నుంచి వైకాపాను గద్దె దించడం అంటే టీడీపీకి పూర్తి అధికారాన్ని కట్టబెట్టడం కాదు కదా అని ఆయన ప్రశ్నించారు.
 
ఇదే అంశంపై ఆయన సోమవారం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్‌కు మరో లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి 30 సీట్లు ఇస్తామని ఒక మీడియా, 27 సీట్లు ఇవ్వనున్నారని మరో మీడియా ఇలాంటి వార్తా కథనాలు వస్తున్నాయన్నారు. ఇలాంటి వార్తలు ఎవరిని మెప్పించడానికి అని ఆయన ప్రశ్నించారు. జనాభాలో 6 శాతం ఉన్న రెడ్లు, 4 శాతం ఉన్న కమ్మ కులస్తులు మిగిలిన బలహీన వర్గాలను ఉపయోగించుకుని రాజకీయంగా, ఆర్థికంగా లబ్ది పొందుతున్నారని విమర్శించారు. 
 
25 శాతం ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులను బీసీలుగా గుర్తింపు పొందకుండా, విద్య, ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్లు పొందకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. వైకాపాని అధికారం నుంచి దింపాలంటే జనసేనకు ఇష్టం ఉన్నా లేకపోయినా టీడీపీతో కలిసి వెళ్లడం తప్పనిసరి అనేది కాదనలేని పరిస్థితి అని చెప్పారు. వైకాపాని అధికారం నుంచి తప్పించడం అంటే టీడీపీకి పూర్తి అధికారాన్ని కట్టబెట్టడం కాదు కదా అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు