కిమ్స్ ఆసుపత్రి వైద్యులు దాసరి ఆరోగ్యంపై హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, మెరుగ్గా ఉన్నారని తెలిపారు. ఊపిరితిత్తుల పని తీరు కూడా నిలకడగా ఉందనీ, వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తున్నట్లు చెప్పారు. ఇంకా మూడు నాలుగు రోజులు ఐసీయూలోనే ఉంటారనీ, ఘన ఆహారం కాకుండా, ఫ్లూయిడ్స్ మాత్రమే ఇస్తున్నట్లు చెప్పారు. దాసరికి డయాబెటిస్ కూడా ఉండటం వల్ల దానిని కంట్రోల్ చేస్తున్నామని వెల్లడించారు. Traciyastamy ట్యూబ్ తీస్తే దాసరి మాట్లాడుతారని చెప్పారు.