తిరుమలలో భారీ రద్దీ... సర్వదర్శనానికి 30 గంటలు.. టోకెన్ల రద్దు

శనివారం, 30 సెప్టెంబరు 2023 (22:39 IST)
కలియుగ వైకుంఠం శ్రీవారి పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో పోటెత్తుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల వరకు సమయం పడుతోంది. 
 
ఈ నేపథ్యంలో, స్వామివారి సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. మరి కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. 
 
భాద్రపద శనివారాలతో పాటు.. సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా వుండటంతో.. ప్రతి రోజూ తిరుపతిలో జారీ చేసే సర్వదర్శన టోకెన్ల జారీ అక్టోబరు 1, 7, 8, 14, 15 తేదీల్లో రద్దు చేస్తున్నామని టీటీడీ పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు