ఏపీలో భారీ వర్షాలు.. రానున్న 24 గంటల్లో కుమ్మేస్తాయా?

శనివారం, 15 అక్టోబరు 2022 (09:49 IST)
ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
 
అలాగే ఈనెల 18న ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఈనెల 20న ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనుంది. 
 
దీని ప్రభావంతో ఈ నెల 19, 20న ఏర్పడనున్న అల్పపీడనం తర్వాత రెండు, మూడు రోజుల్లో ఏపీ తీరం దిశగా వచ్చే క్రమంలో మరింత బలపడే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 
 
ఇప్పటికే వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగింది.. ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజ్‌ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు