ఈకాలం కుర్రకారుకు... మొబైల్ లేనిదే ముద్ద దిగదు. అలాంటి మొబైల్స్ చోరీ చేయడమే తన హాబీగా పెట్టుకున్నాడు ఈ మొబైల్స్ దొంగ. ముఖ్యంగా దీనికి హాస్టళ్ళనే టార్గెట్ గా చేసుకున్నాడు. ఎందుకంటే, అక్కడ ఒకే సారి బోలెడు మొబైల్స్ దొరుకుతాయి.
పైగా, అందరూ నిద్రపోయేవరకు మొబైల్స్ చూసి ఆదమరిచి పడుకుని ఉంటారు. వారి పక్కనే ఉండే మొబైల్స్ కొట్టేయడం కూడా ఈజీ. అందుకే ఈ మొబైల్స్ దొంగ హాస్టళ్ళను టార్గెట్ చేసుకున్నాడు. ఒకటి కాదు... రెండు కాదు 500 లకు పైగా మొబైల్స్ చోరీ చేశాడు. చివరికి గుంటూరు బాయ్స్ హాస్టల్ లో మొబైల్స్ చోరీకి వచ్చి ... సీసీ కెమేరా కంటిచి చిక్కాడు.
గుంటూరు లక్ష్మీపురం అశోక్ నగర్ లక్ష్మి గణపతి బాయ్స్ హాస్టల్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో దుండగుడు హాస్టల్ లోకి ప్రవేశించి, 9 మంది విద్యార్థుల మొబైల్ ఫోన్లు చోరీ చేసాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. మొబైల్ పోగొట్టుకున్న విద్యార్థులు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికి వరుసగా 13 హాస్టల్ లలో ఇలా చోరీ చేసి, 500 మొబైల్స్ పట్టుకుపోయినట్లు పోలీసులు చెప్తున్నారు. కేసును విచారిస్తున్నారు.