అయితే వీరందరికి ఎలాంటీ లోటు రాకుండా ఉండడడంతో పాటు వారికి ఎలాంటీ ఇబ్బంది వచ్చినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చేందుకు వారందరికి సెల్ ఫోన్‌లు ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ సెల్‌ఫోన్‌లలో జిల్లాస్థాయి అధికారులతో పాటు, హెల్ప్‌లైన్, ఎమర్జెన్సీ నెంబర్లను ఫీడ్ చేసి ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
దీని ద్వారా వారు ఎప్పుడైనా.. అధికారులతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు వీరికి నెలవారి రేషన్, సరుకులు, సెల్ ఫోన్లు అందించేందుకు స్వచ్ఛంధ సేవ సంస్థల సహాకారం తీసుకోనున్నారు. స్కూళ్లు ప్రారంభం అయిన తర్వాత అందరని రెసిడేన్సియల్ స్కూళ్లలో చేర్పించేందుకు కరోనా మహమ్మారిన పడి తల్లితండ్రులను కోల్పోయిన చాలా మంది పిల్లలు అనాథలయ్యారు.