తెలంగాణ ప్రభుత్వ డెస్క్‌లో రామ్ చరణ్ సతీమణికి జాబ్...

శుక్రవారం, 25 జనవరి 2019 (09:47 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డెస్క్‌లో కోఆర్డినేటర్‌గా చేరారు. పైగా, తన కొత్త జాబ్ ఎలా ఉంది కేటీఆర్ గారూ అంటూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. 
 
దావోస్ వేదికగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు జరుగుతోంది. ఇందులో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా పాల్గొన్నారు. అక్కడ ఆమె ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్‌కు కోఆర్టినేటర్‌గా పని చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఆమె సమాచారం అందించారు.
 
అంతేకాదు తెలంగాణలో పెట్టుబడులకు ఎలాంటి అనుకూల ప‌రిస్థితులు ఉన్నాయో ఆమె పెట్టుబడిదారులకు వివ‌రించారు. ఈ విష‌యాలని కేటీఆర్‌కి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ.. 'నా జాబ్ ఎలా ఉంది కేటీఆర్‌గారు' అని అడిగింది. 
 
దీనికి కేటీఆర్ స్పందించారు. 'నీకు ధన్యావాదాలు ఉపాసన. మా టీం స్థైర్యాన్ని పెంచినందుకు ఆనందంగా ఉంద‌'ని కామెంట్ పెట్టారు. డెస్క్‌లో ప‌ని చేసిన ఫోటోల‌ని కూడా ఉపాస‌న త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

 

How do u like my new job ? @KTRTRS garu. Sitting behind the desk at the #Telangana Pavilion @wef helping the fab team with #investintelangana -
#3 on the world's best place to live

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు