రామ్ చరణ్ నన్ను సొంత అక్కలా చూసుకునేవారు. సినిమా షూటింగ్‌లో ఎప్పుడు బిజీగా ఉండే చరణ్ తీరిక దొరికితే అందరిని ఆప్యాయంగా పిలిచేవారు. ఒకరోజు ఉన్నట్లుండి అక్కా... ఇంటికి రండి అని అడిగారు. నాకు ఏం అర్థం కాలేదు. నా భర్తతో కలిసి భోజనం చేసేందుకు రమ్మన్నారు. మా నాన్న చిరంజీవిని మీకు పరిచయం చేస్తానని కూడా చెప్పడంతో త్వరలోనే రాంచరణ్ ఇంటికి వెళ్ళి అందరినీ కలుస్తానని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు స్నేహ.