రైతు సంఘాన్ని బలోపేతం చేయడం ద్వారా వేంపల్లిలో జీవితాలను సోలార్ డ్రైయర్స్ ఎలా మార్చాయి?

ఐవీఆర్

సోమవారం, 25 మార్చి 2024 (22:12 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో ఉన్న ఆహ్లాదకరమైన  ఒక చిన్న గ్రామం, వేంపల్లిలో శ్రీమతి మల్లేశ్వరమ్మ ఒక స్వయం సహాయక బృందానికి (SHG) నాయకత్వం వహిస్తున్నారు. ఒకప్పుడు మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల సవాలును ఎదుర్కొన్న శ్రీమతి మల్లేశ్వరమ్మ యొక్క  స్వయం సహాయక సంఘం నిమ్మ, టమాటా సాగులో అవిశ్రాంతంగా కృషి చేసినప్పటికీ చిక్కుల్లో పడింది. వారు కష్టపడి సాగు చేసినప్పటికీ,   ఒడిదుడుకుల మార్కెట్లలో వారి పంట దిగుబడికి సరసమైన ధరను పొందడంలో విఫలమయ్యారు. సెంటర్ ఫర్ సస్టెయినబుల్ ఎనర్జీ సౌజన్యంతో సోలార్ డ్రైయర్‌ల రూపంలో ఆశాజ్యోతి వెలుగులోకి వచ్చే వరకు వారి శ్రమ ఫలించలేదని అనిపించింది.
 
సోలార్ డ్రైయర్‌ల ఏర్పాటుతో, ఒక విప్లవాత్మక మార్పు సంభవించింది. ఇక వారి విలువైన పంటలు అనూహ్య మార్కెట్ శక్తుల దయపై ఆధార పడవలసిన అవసరం లేకుండా పోయింది. సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ యొక్క అమూల్యమైన మద్దతుతో అమర్చబడిన సోలార్ డ్రైయర్‌లు వారి ప్రయత్నాలకు కొత్త జీవితాన్ని ఇచ్చాయి. నిమ్మకాయలు, టమోటాలు, ఒకప్పుడు విక్రయించబడనివిగా భావించబడ్డాయి, కానీ  ఇప్పుడు నిర్జలీకరణ ఉత్పత్తులుగా ప్రయోజనం పొందుతున్నాయి.
 
దీన్ని ఒకసారి ఊహించండి: ఒకప్పుడు మార్కెట్లో కేవలం 160 రూపాయలకు విక్రయించబడే 20 కిలోల టమోటా బాక్సు, ఇప్పుడు 1 కిలో ఎండిన టమోటాలుగా రూపాంతరం చెంది, అది 320 రూపాయలను పొందుతుంది. విలువలో ఈ రెండింతల పెరుగుదల వారి శ్రమకు న్యాయమైన పరిహారాన్ని అందించడమే కాకుండా వారి జీవనోపాధి పరంగా గర్వం, భద్రతను కలిగిస్తుంది.
 
సుస్థిర వ్యవసాయం, ఆర్థిక వృద్ధికి మార్గదర్శకత్వం
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సామాజిక సంస్థగా, పర్యావరణ అనుకూల వ్యవసాయం కోసం పోరాడుతున్న ప్రముఖ ప్రచారకర్తగా, రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్, ఉపయోగించని సహజ వనరులను వినియోగించుకుంటూ, అత్యాధునికమైన సోలార్ డ్రైయర్‌లను ఉపయోగించి అసమానమైన, నాణ్యమైన సహజ వినియోగదారు ఉత్పత్తులను రూపొందించడం చేస్తుంది. సాధారణంగా, పొలం నుండి టేబుల్‌కి ప్రయాణం సుదీర్ఘంగా ఉంటుంది, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కూరగాయలు, పండ్లు ఎక్కువగా పండే లేదా చెడిపోయే అవకాశం ఉంది. ఇది వాటి రూపాన్ని ప్రభావితం చేయడమే కాకుండా కొనుగోలుదారులు అటువంటి ఉత్పత్తులను పట్టించుకోనందున గణనీయమైన నష్టాలకు దారి తీస్తుంది. అయితే, సోలార్ డ్రైయర్స్ పరిచయంతో, ఒక పరివర్తన పరిష్కారం లభిస్తుంది.
 
హానికరమైన యువి కిరణాలు, అధిక వేడి నుండి వాటిని రక్షించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడంలో సోలార్ డ్రైయర్లు కీలక పాత్ర పోషిస్తాయి, తద్వారా వాటి సహజ రంగు, లక్షణాలను సంరక్షిస్తాయి. ఫలితం? ప్రీమియం-నాణ్యత కలిగిన ఉత్పత్తి దాని పోషక విలువలపై జీరో రాజీతో, నిల్వకారకాలు అవసరం లేకుండా పొందగలుగుతున్నాము. ఈ ఉత్పత్తులు మార్కెట్‌లోకి వచ్చే సమయానికి, అవి తాజాదనాన్ని, పక్వతని వెదజల్లుతూ వృధా అయ్యే అవకాశాలను తొలగిస్తాయి.
 
రైతు జీవనోపాధిపై పరివర్తన ప్రభావం
RSFP యొక్క సోలార్ డ్రైయర్‌లు, సమయం అత్యంత కీలకమైన ప్రపంచంలో శ్రీమతి మల్లేశ్వరమ్మ, ఆమె SHG బృందం లాంటి రైతులకు ఆశాజ్యోతిగా పనిచేస్తాయి. ఈ వినూత్న డ్రైయర్‌లు ప్రతి పండు, కూరగాయ యొక్క సహజ ఆకర్షణను సంరక్షిస్తాయి కాబట్టి, అతిగా పండిన లేదా పాడైపోయిన ఉత్పత్తుల గురించి చింతించే రోజులు పోయాయి. ప్రతి ఉత్పత్తి దశలో కఠినమైన నాణ్యతా తనిఖీలతో, RSFP అత్యధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులు మాత్రమే మార్కెట్‌లోకి వచ్చేలా చేస్తుంది. ఈ నిబద్ధత గ్రామీణ జీవనోపాధిపై స్థిరమైన వ్యవసాయ పద్ధతుల యొక్క తీవ్ర ప్రభావాన్ని హైలైట్ చేస్తూ, RSFPతో భాగస్వాములైన రైతులకు ఆదాయంలో 30% గణనీయమైన పెరుగుదలకు దారితీసింది.
 
అంతేకాకుండా, RSFP ప్రభావం ఆర్థిక లాభాలకు మించి విస్తరించింది. 60,000 మంది రైతులకు సాధికారత కల్పించడం ద్వారా, 18480 MT కార్బన్ ఫుట్ ప్రింట్, 8400 MT ఆహార వ్యర్థాలను నివారించడం ద్వారా, RSFP వ్యవసాయ వర్గాలలో సానుకూల మార్పుకు ఉత్ప్రేరకంగా మారింది. అదనంగా, 5500+ ఉద్యోగాల సృష్టి, ప్రాసెసింగ్ సౌకర్యాలలో 4000 మంది మహిళల ప్రమేయం సమ్మిళిత వృద్ధి, లింగ సమానత్వాన్ని పెంపొందించడంలో RSFP యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఈ బహుముఖ కార్యక్రమాల ద్వారా, RSFP రైతుల జీవితాలను గణనీయంగా మెరుగుపరిచింది, స్థిరమైన వ్యవసాయం యొక్క పరివర్తన శక్తిని ప్రదర్శిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు