వివాహితుడితో కుమార్తె ప్రేమ... పరాయి స్త్రీతో భర్త అక్రమ సంబంధం... ఇద్దరూ కలిసి...

మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (09:23 IST)
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు రూరల్ మండలంలో దారుణం జరిగింది. భర్త, కుమార్తె కలిసి భార్యను చంపేశారు. ఈ మేరకు ఆ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. తమ అల్లుడు, మనవరాలు కలిసి తమ కుమార్తెను చంపేశారంటూ ఆరోపించారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో చెందిన బొబ్బిలి వెంకటరామారావు అదే గ్రామానికి చెందిన ప్రణయత(33) 2000 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రణయత ఐదేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశానికి వెళ్లింది. దీంతో వెంకటరామారావు దేవరపల్లి మండలం గౌరీపట్నానికి చెందిన ఒక మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. 
 
దీంతో ఆమె తరచూ తిమ్మరాజుపాలెంలోని వెంకటరామారావు ఇంటికి వచ్చివెళ్లేంది. ఈ విషయం 18 యేళ్ళ పెద్ద కుమార్తెకు కూడా తెలుసు. ఈమె నిడదవోలులోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తోంది. ఈ విషయం తండ్రితో పాటు తల్లి ప్రణయతకు కూడా తెలుసు. దీంతో కుమార్తెను తల్లి మాత్రమే నిలదీసింది. తండ్రి మాత్రం పెద్దగా పట్టించుకోకపోగా సపోర్టు చేయసాగాడు. 
 
అదేసమయంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను తండ్రి కొన్నిసార్లు నేరుగా ఇంటికి తీసుకొచ్చినప్పటికీ పెద్దకుమార్తెకు తెలిసినా తల్లికి చెప్పలేదు. తండ్రి, కుమార్తెలిద్దరూ ఒకేమాట మీద ఉంటూ వచ్చారు. కుమార్తె వివాహమైన యువకుడిని ప్రేమించడంతో భార్యభర్తల మధ్య ఆదివారం రాత్రి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. 
 
అనంతరం నిద్రిస్తున్న భార్యను కోపంతో రగిలిపోతున్న భర్త రాడ్డుతో కొట్టడంతో పాటు పెట్రోల్‌ పోసి కిరాతంగా హత్య చేశాడు. తల్లిని హత్య చేయడంలో పెద్దకూతురు కూడా తండ్రికి సహకరించినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో వేసుకున్న దుస్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు విచారణ చేస్తున్నట్టు తెలిసింది. అల్లుడు, మనవరాలు కలిసి తన కుమార్తెను హత్యచేశారని మృతురాలి తల్లి కొండేపూడి లక్ష్మి ఆరోపిస్తూ కన్నీటిపర్యంమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు