పాప్‌కు తొలి కార్డినల్‌గా ఎన్నికైన తొలి తెలుగు బిషప్ పూల ఆంథోనీ

ఆదివారం, 28 ఆగస్టు 2022 (14:11 IST)
పోప్ ఫ్రాన్సిస్‌కు కార్డినల్‌గా తొలి తెలుగు బిషప్‌గా పూల ఆంథోనీ ఎంపికయ్యారు. తద్వారా ఆయన సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఈ మేరకు వాటికన్‌ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికాలో శనివారం జరిగిన వేడుకలో పోప్ కార్డినల్‌గా పూల ఆంథోనీ బాధ్యతలు స్వకరించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకను వీక్షించేందుకు హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో క్రైస్తవ ప్రముఖుల వాటికల్ సిటీలో వెళ్లారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పూల ఆంథోనీ 1992లో మత గురువుగా బాధ్యతలు చేపట్టారు. రోమన్ కథోలిక్స్‌కు సంబంధించి కర్నూలు డయాసిస్ బిషప్‌గా ఆయన 2008లో బాధ్యతలు చేపట్టారు. 
 
నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల రోమ‌న్ క‌థోలిక్ వ్య‌వ‌హారాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చిన ఆంథోనీ.. తాజాగా పోప్ కార్డిన‌ల్‌గా ఎంపిక కావ‌డం గ‌మ‌నార్హం. ఆయా వ్య‌వ‌హారాల్లో పోప్‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు అంద‌జేసేందుకు నియ‌మితుల‌య్యే వారినే కార్డిన‌ల్స్ అంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు