మదర్సాలో బాలుడిపై ఉపాధ్యాయుడి లైంగికదాడి... నొప్పి భరించలేక చెప్పేశాడు

శనివారం, 5 ఆగస్టు 2017 (11:47 IST)
తమవద్ద చదువుకునేందుకు వచ్చే బాలబాలికలకు విద్యాబుద్ధులు చెప్పి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ ఉపాధ్యాయుడు కామంతో కళ్ళుమూసుకునిపోయి పశువులా ప్రవర్తించాడు. తన వద్ద చదువుకునే ఓ బాలుడిపై పాశవికంగా లైంగికదాడి చేశారు. దీంతో ఆ బాలుడు నొప్పిని భరించలేక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్ నగరంలోని లంగర్‌హౌస్‌లో ఓ మదర్సా ఉంది. ఇందులో చదువుకునే 12 యేళ్ల బాలుడిపై అక్కడ చదువు చెప్పే ఓ ఉపాధ్యాయుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆ తర్వాత విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. 
 
అయితే, ఆ బాలుడు నొప్పిని భరించలేక మదర్సా నుంచి ఇంటికి వెళ్లి ముభావంగా ఉండిపోయాడు. మెత్తగా ఉన్న బాలుడిని తల్లిదండ్రులు ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పాడు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు లంగర్‌హౌస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుడు ఎవరనేది తేలాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి