'మార్గన్' తర్వాత విజయ్ ఆంటోనీ 'భద్రకాళి' చిత్రంతో వస్తున్నారు. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.
రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న భద్రకాళి కోపం, తిరుగుబాటు, కరప్ట్ వ్యవస్థను తుడిచిపెట్టేయాలనే ఫైర్‌తో నిండిన కథతో రూపొందుతుంది. ఇంటెన్స్ కథనం, హై-ఆక్టేన్ యాక్షన్‌తో ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో మార్గన్ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తుంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్ కూడా ఉండడంతో ప్రాజెక్ట్‌పై మంచి బజ్ ఉంది.
రిలీజ్ డేట్ పోస్టర్‌లో విజయ్ ఆంటోనీ నేలపై కూర్చుని, రెండు చేతులతో పిస్టల్ పట్టుకుని ఫెరోషియస్ లుక్ లో కనిపించారు. తని ముఖంలో కనిపించే ఆ కోపం ఎవరినైనా ఢీకొట్టేలా ఉంది. బ్యాక్ డ్రాప్ లో ఎర్రచంద్రుడు, పురాతన గోపురాలు, చారిత్రక నిర్మాణాల సిల్వెట్‌లతో +పోస్టర్ ఆసక్తిని పెంచింది.
ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తున్నారు. షెల్లీ కాలిస్ట్ డీవోపీ, విజయ్ ఆంటోనీ స్వయంగా మ్యూజిక్ అందిస్తున్నారు. రేమండ్ డెరిక్ ఎడిటర్. రాజశేఖర్ ఫైట్ మాస్టర్. శ్రీరమన్ ఆర్ట్ డైరెక్టర్. తెలుగులో డైలాగ్స్‌ని రాజశేఖర్ రెడ్డి రాశారు. ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో మేకర్స్ హై ఓల్టేజ్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు.
హైదరాబాద్ ప్రమోషన్ లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ, అరుణ్ ప్రభు నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఆయన్ని గొప్పగా అభిమానిస్తారు. హీరోయిన్ తృప్తి చాలా మంచి నటి. ఈ సినిమాల్లో చాలా సెటిల్ గా పెర్ఫార్మ్ చేసింది. సురేష్ బాబు కి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది నా 25వ చిత్రం. వెరీ న్యూ పొలిటికల్ జానర్. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. గతంలో వచ్చిన పొలిటికల్ సినిమాలన్నిటికీ ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది'అన్నారు.
డైరెక్టర్ అరుణ్ ప్రభు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా తొలి సినిమా అరువి రిలీజ్ అయినప్పుడు తొలి ప్రశంస నాకు తెలుగు ఇండస్ట్రీ నుంచే వచ్చింది. రానా గారు, విజయ్ దేవరకొండ గారు, త్రివిక్రమ్ గారు నా వర్క్ ని అప్రిషియేట్ చేశారు. భద్రకాళి నా ఫస్ట్ తెలుగు రిలీజ్. ఇది పొలిటికల్ ఎంటర్టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా రిలేటబుల్ గా ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. విజయ్ గారికి, సురేష్ బాబు గారికి, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు'అన్నారు.
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ, విజయ్ ప్రతిదీ చాలా డీటెయిల్ గా డిజైన్ చేస్తారు. రామ్ గారికి మా నాన్న గారితో కూడా పరిచయం ఉంది. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రేక్షకులకి సినిమా రాబోతుందని చెప్పడం చాలా ముఖ్యం. ఈ సినిమాని ఎంత ఉత్సాహంగా ప్రమోట్ చేయడం అనేది చాలా మంచి పరిణామం. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్'అంటారు.