ఈ విచారణలో భాగంగా, సైబరాబాద్ పోలీసులు ప్రధాన నిందితుడు మేనేజర్ మల్లికార్జున్‌తో పాటు మరో ఐదుగురు ఈ స్కాంలో ఉన్నారని తేల్చారు. వీరిని అరెస్టు చేసి, వీరివద్ద నుంచి రూ.41 లక్షలు, ల్యాప్‌టాప్, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గత అనుభముతోనే ఈ మోసం చేశారని తేల్చారు. ఫైన్‌మిత్ర ద్వారా రూ.45 లక్షలకు పైగా మోసం చేసినట్లు తెలిపారు. ఈ స్కాంలో మొత్తం 650 మంది కరక్కాయ బాధితులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
మొత్తం 81 టన్నుల కరక్కాయలను మార్కెట్ నుంచి కొనుగోలు చేశారన్నారు. రూ.8,17,92,000 నగదును వినియోగదారుల నుంచి నిందితులు సేకరించారు. వ్యాపారం కంటే మోసం చేయాలనే ఉద్దేశంతోనే యాజమాన్యం కంపెనీని స్థాపించిందని తెలిపారు. బాధితుల్లో 80 శాతం మహిళలే ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.