గండి మైసమ్మ ఆలయం వద్ద అపరాచరం - మహిళపై అత్యాచారం

శనివారం, 30 ఏప్రియల్ 2022 (14:10 IST)
జంట నగరవాసులకు ఇష్టదైవంగా ఉన్న గండి మైసమ్మ ఆలయం వద్ద అపచారం జరిగింది. ఈ గుడి వద్ద శుక్రవారం రాత్రి ఓ మహిళ అత్యాచారానికి గురైంది. నలుగురు ఆటో డ్రైవర్లు కలిసి మహిళను మానభంగం చేశారు ఈ దారుణానికి పాల్పడిన నిందితులను నరసింహ (23), ఇమామ్ (20), కుద్దూస్ (21), ఉమ్రుద్దీన్ (21)గా గుర్తించి, అరెస్టు శారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు షోలాపూర్‌కు చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు చేరుకుంది. ఆమెను గుర్తించిన నిందితులు ఆశ్రయం కల్పిస్తామని చెప్పి మైసమ్మ గుడి వద్ద ఉన్న ఒక మద్యంబారు వద్దకు బలవంతంగా తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇమామ్‌ను అదుపులోకి తీసుకుని అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని రక్షించి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు